అప్పుల బాధతో రైలు కిందపడి ఆత్మహత్య
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలంలోని అభంగపట్నం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినోద్(29) దుబాయ్ లో ఉండేవాడు. ఏడు నెలల క్రితం తిరిగి వచ్చేశాడు. అప్పటినుంచి ఖాళీగా ఉన్నాడు. మళ్లీ దుబాయ్ వెళదామని అనుకోగా.. అవాంతరాలు ఎదురయ్యాయి. కాగా.. జీవితంపై విరక్తితో శుక్రవారం అభంగపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.