బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా గుంజల నాగభూషణ్

71చూసినవారు
బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా గుంజల నాగభూషణ్
నవీపేట్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా గుంజల నాగ భూషణ్ ను నియమించినట్లు మండల బిజెపి అధ్యక్షులు సరీన్ శనివారం తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాష్ రెడ్డి లు ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మండలంలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్