సీఎం కప్ అర్చరీ గేమ్స్ లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరాముడు గ్రామానికి చెందిన బాకారం రవి కుమారుడు రాహుల్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు. గత నెల 19న ఖమ్మంలో జరుగిన జిల్లాల స్థాయి అర్చరీ గేమ్స్ లో సెలెక్ట్ అయ్యాడు. బుధవారం ఫైనల్లో నిజామాబాద్ నుండి బాకారం రాహుల్ ఖమ్మం జిల్లా నుండి శివ సాయి ఇద్దరు తలపడగా రాహుల్ స్టేట్ ఫస్ట్ రావడంతో తండ్రి బాకారం రవి తన కుమారుని అభినందించారు.