కొండాపూర్(చంద్ర దేవుడు) నుండి రెడ్డిపేట్ స్కూల్ తాండ వరకు అడవి మార్గంలో మరమ్మతులు చేసి సింగిల్ డాంబర్ రొడ్డు వేసి కనీసం పది రోజులు కూడా గడవక ముందే రెం డు రొడ్డు ప్రమాదాలు జరుగడం చాలా బాధకమైన విషయం. దీనికి గల కారణాలు అతి ప్రమాదకరమైన మలుపులు, పైగా సింగిల్ రొడ్డు నూతనంగా రొడ్డు వెయ్యడం వలన వాహనదా రులు అతి వేగంగా వెళ్ళటం వల్ల మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనం కన్పించక ప్రమాదలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరుగకుడదాని వాహన దారులను హెచ్చరిస్తు రోడ్డుకి ఇరువైపులా ప్లెక్సిలు కట్టడం జరిగింది.
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్-తుంపల్లి వారి అద్వర్యంలో ఫ్లెక్సీ లు కట్టి వాహనదారులకు వారి ప్రయాణం క్షేమంగా ఉండాలని తెలిపారు.