దసరా, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు. బుధవారం ఆర్ఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నేటి నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు 482 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ నుంచి జేబీఎస్, జేబీఎస్ నుంచి నిజామాబాద్ కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల నుంచి జేబీఎస్కు బస్సులు నడుపుతున్నామన్నారు.