నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి, ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహశీల్దార్ గజానన్ ఉన్నారు.