నల్లమలగిరి ప్రసాద్ ఆశయాలు కొనసాగిస్తాం - సిపిఐ

74చూసినవారు
నల్లమలగిరి ప్రసాద్ ఆశయాలు కొనసాగిస్తాం - సిపిఐ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కామ్రేడ్ నల్లమల్ల గిరి ప్రసాద్ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. ఓమయ్య మాట్లాడుతూ నల్లమల్ల గిరి ప్రసాద్ నిజాం నవాబు భూస్వాములు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్