ఉద్యోగాలు హాబీ కోసమే చేసే రోజులొస్తాయి: మస్క్‌

76చూసినవారు
ఉద్యోగాలు హాబీ కోసమే చేసే రోజులొస్తాయి: మస్క్‌
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలన్నిటినీ ఊడగొడుతుందని.. భవిష్యత్తులో ఉద్యోగం చేయడం కేవలం ఆప్షన్ మాత్రమే అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఉద్యోగం అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచి కోసమే చేసే రోజులొస్తాయి. కొన్నేళ్లలోనే కృత్రిమమేధ సామర్థ్యాలు అతివేగంగా అభివృద్ధి చెందాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతే నా అతిపెద్ద భయం’’అని మస్క్ తెలిపారు.

సంబంధిత పోస్ట్