రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తోందని గురువారం ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించారని.. ఇప్పుడు రైతు భరోసాకు కూడా అప్లికేషన్లు తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఉంటారా? ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారు? అని ఫైర్ అయ్యారు.