నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తారని అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బార్ అసోసియేషన్ (202- 26) ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేశామని, ఏప్రిల్ 11న ఎన్నికలను నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విఘ్నేశ్, ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవిని నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.