నిజామాబాద్ జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి డయల్ 100 కు సమాచారమివ్వడంతో రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రైలు పట్టాలపై కుర్చున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు తాడికొండ నర్సయ్యగా గుర్తించారు. తను హోంగార్డుగా పని చేస్తున్నట్లు వెల్లడించాడు. భార్య, అత్తమామాల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు.