విద్యలో మత జోక్యాన్ని తీసుకువచ్చే నూతన జాతీయ విద్యా విధానం 2020, యూజీసీ ముసాయిదా 2025 లకు వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి యువతకు పిలుపునిచ్చారు. కామ్రేడ్ భగత్ సింగ్, రాజా గురు సుఖుదేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నిజామాబాద్ నగరంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.