ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన

2668చూసినవారు
ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన
భారతదేశంలో ఉన్న చేతి వృత్తిదారులే అసలైన భారతదేశ నిర్మాతలని, అలాంటి గౌరవనీయ చేతి వృత్తులను ముందుతరాల కోసం కాపాడుకుంటూ వారి జీవితాల్లో ఆర్ధికంగా భరోసా కల్పిస్తూ , శిక్షణా పరంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం మంచి శిక్షణా కేంద్రాలతో పాటు వ్యాపారపరంగా ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో "ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన" పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం రి. నె: 329/2021 ఆధ్వర్యంలో మాన్య గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఆత్మహత్యలతో అంతమైపోతున్న చేతి వృత్తుల వారందరికి కేంద్ర ప్రభుత్వం తరపున మంచి రోజులు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మారుపాక కిషన్ చారి, రాష్ట్ర కోశాధికారి తంగళ్ళపల్లి శ్రీనివాసచారి, జిల్లా కోశాధికారి నూనె వేణుచారి, జిల్లా ప్రధానకార్యదర్శి కోటగిరి శ్రీనివాసచారి, జిల్లా ప్రచార కార్యదర్శి బందనకంటి నరసింహాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు రామాస్వామి, తాటికొండ సదానందం, వడ్ల రాములుచారి, సుధాకరచారి మరియు సంఘ పెద్దలు, విశ్వకర్మ ఆత్మీయులందరు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్