చందూర్ మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్బంగా తాను చేసిన సేవలు గుర్తు చేశారు. మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలికలకు విద్యా ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ నరేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.