Jan 23, 2025, 01:01 IST/
తెలంగాణలో పంట బీమా అమలు అప్పుడే?
Jan 23, 2025, 01:01 IST
తెలంగాణలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు భారతీయ వ్యవసాయ బీమా సంస్థ(ఏఐసీ) ముందుకొచ్చింది. ఇప్పటికే బీమా పథకం అమలుపై కసరత్తు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏఐసీ ప్రతిపాదనపై నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. బీమా ప్రీమియంను తామే చెల్లించి, రైతులకు ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. నిబంధనల మేరకు బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.