డీజేలకు లైసెన్స్ తప్పనిసరి
సిరికొండ మండలం పరిధిలోని డీజే యజమానులకు దేవి నవాత్రుల ఉత్సవాలలో భాగంగా ఎస్సై ఎల్. రామ్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎల్. రామ్ మాట్లాడుతూ, డీజే నిర్వాహకులు డీజేలకు లైసెన్సులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లైసెన్స్ లేనిచో ఆ డీజేలను సీజ్ చేయడం జరుగుతుందని శుక్రవారం అన్నారు. డీజేలకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని లేకపోతే డీజే నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని అన్నారు.