జలదిగ్బంధమైన సిరికొండ మండలం
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సిరికొండ మండలం జలదిగ్బంధమైంది. సిరికొండ మండలానికి ఇతర ప్రాంతాలకు రాకపోకల బంద్ అయ్యాయి. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచనలు చేశారు.