అన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలలో గాంధీ జయంతి
వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు శ్రమదానం, ఇతర కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.