హరీశ్ రావును పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేతపై పోలీసులు ఎలాంటి కేసు పెట్టలేదని BRS నేత RS ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గాంధీ భవన్‌లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని.. పొలీసు అధికారులు వాటిని యధాతథంగా FIRలుగా నమోదు చేస్తున్నారని ఆరోపించారు. గొర్రెల స్కాంలో కొడంగల్‌కు చెందిన ఓ అధికారిని 52 రోజులు ఆకారణంగా జైల్లో పెట్టారని చెప్పారు. BRS సోషల్ మీడియా వారియర్స్‌పై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.