ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు ఇంత వరకు ఎటువంటి పదవి కేటాయించకపోవడంపై ఆయన మద్దతుదారులు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో వర్మకు పదవి ఇస్తే పవన్‌కు మద్దతు తగ్గుతుందనే కారణంతోనే ఆయనను పట్టించుకోవడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వర్మ తన క్యాడర్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.