ఎన్ని కేసులు పెట్టినా BRS కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారని BRS MLC కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలైన చాలా రోజుల తర్వాత తొలిసారి నిజామాబాద్‌కు కవిత వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం. మేం తప్పు చేయలేదు. భయపడే ప్రసక్తే లేదు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలి' అని సీఎంను ఉద్దేశించి మాట్లాడారు.