రాజకీయ కక్షసాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈడీ విచారణ అనంతరం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. "ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి.. ఈడీ కూడా ప్రశ్నించింది. ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకేరకంగా ఉన్నాయి. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తాను. ఎన్ని ప్రశ్నలైనా అడిగినా సమాధానం చెబుతాను. నా నిజాయితీని నిరూపించుకుంటాను." అని కేటీఆర్ అన్నారు.