‘మా బాధలు చూసిన తరువాత ఏ తల్లితండ్రులు బెటాలియన్ కానిస్టేబుళ్లకు పిల్లనివ్వరు’ అని ఓ కానిస్టేబుల్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల భార్యలు నిరసనలు తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మా బాబు ఆడుకునే కుక్కను గుర్తుపడుతున్నాడు. కానీ తన తండ్రిని గుర్తుపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పండగలకు వారిని ఇంటికి పండం లేదు. కానిస్టేబుళ్లుగా పనిచేయడం కంటే కూలీ పని చేసుకోవడం ఉత్తమమని వాపోయింది.