తమిళ హీరో విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి జంటగా నటించిన మూవీ 'మద గజ రాజ'. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో విడుదలైంది. అయితే ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో తెలుగులో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సందర్భంగా తెలుగు మూవీ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ చేతుల మీదుగా రేపు విడుదల చేయనున్నారు. కాగా ఈ మూవీ జనవరి 31న విడుదల కానుంది.