AP: రఘురామకృష్ణంరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు ఏ-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.