రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కొనుగోలుదారుల నుంచి 4 టన్నుల కారం పొడిని వాపస్ తీసుకుంది. అయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల ఆదేశాల మేరకు ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ సంజీవ్ అస్థానా తెలిపారు. అధికారులు తెలిపిన నిబంధనలకు తగ్గట్లు లేదని, కారానికి పురుగులు పట్టకుండా ఉండటానికి ఉపయోగించే కెమికల్‌ను మోతాదుకు మించి ఉపయోగించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది.