తెలంగాణలో కరెంటు సమస్యలు లేవు: CM

62చూసినవారు
తెలంగాణలో కరెంటు సమస్యలు లేవు: CM
తెలంగాణలో కరెంటు సమస్యలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. 'విద్యుత్ వినియోగం పెరగడంతో సరఫరాలో కొన్నిచోట్ల అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చాం. మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు.. ఆ అవసరం కూడా లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్