ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ

66చూసినవారు
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1న ముగియనుండటంతో ఎన్నికకు ఈసీ షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ MLC ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చంద్రశేఖర్, సాయన్న అభ్యర్థిత్వాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి రిజెక్ట్ చేశారు. ఈ స్థానం కోసం MIM, BJP పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్