రహస్యంగా కాదు.. ప్రైవేటుగా పెళ్లి చేసుకోవాలనుకున్నా: టాలీవుడ్ నటి

78చూసినవారు
రహస్యంగా కాదు.. ప్రైవేటుగా పెళ్లి చేసుకోవాలనుకున్నా: టాలీవుడ్ నటి
ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకోవడంపై హీరోయిన్ తాప్సీ స్పందించారు. ‘నా వివాహాన్ని ప్రైవేటుగా చేసుకోవాలనుకున్నా కానీ రహస్యంగా కాదు' అని స్పష్టం చేశారు. తన వైవాహిక జీవితాన్ని పబ్లిక్ లో పెట్టొద్దనే ఉద్దేశంతోనే పెళ్లి ఫొటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో పెట్టలేదని తాప్సీ వివరించారు. మార్చి 22న బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్తో, తాప్సీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్