TG: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'X' వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీ అని అన్నారు. ఇది ప్రజా పాలన కాదని, ప్రజల ఆకాంక్షల హేళన చేసే పాలన అని అన్నారు. సుప్రీం ఆదేశాలతో సర్కారుకు దిమ్మతిరిగిందని.. ఎకో పార్క్ నిర్మాణం అంటే ఏఐ వీడియో తయారు చేసినంత ఈజీ కాదని కేటీఆర్ సెటైర్లు వేశారు.