చంద్రబాబు, నారా లోకేష్, బాలయ్యకు అభినందనలు తెలిపిన NTR

83చూసినవారు
చంద్రబాబు, నారా లోకేష్, బాలయ్యకు అభినందనలు తెలిపిన NTR
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్‌గా మారింది. 'ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన శ్రీభరత్‌కి, పురంధేశ్వరి అత్తకి శుభాకాంక్షలు' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్