లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. అంజలి తన తండ్రి ప్రభావాన్ని ఉపయోగించి మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఆ నిరాధారమైన పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. అవి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని దావా వేశారు. ఈ కేసు విచారణకు కోర్టు అంగీకరించినట్లు తెలుస్తోంది.