నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్పులు 2024-25 సంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. పూర్తి వివరాలకు https://dsel.education.gov.in/scheme/nmmss వెబ్‌సైట్‌ను సందర్శించండి.