గనిలో లిఫ్ట్‌ కూలి ఒకరి మృతి (వీడియో)

78చూసినవారు
గనిలో లిఫ్ట్‌ కూలిపోవడంతో ఓ అధికారి మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఝన్‌ఝును జిల్లాలో ఉన్న కోలిహాన్ గనిలో చోటుచేసుకుంది. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన గనిలో గత రాత్రి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో 14 మంది విజిలెన్స్ సభ్యుల బృందం గనిలో చిక్కుకుపోయింది. వారందరినీ రక్షించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని జైపూర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వారిలో ఓ అధికారి మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్