తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పర్యటించే హక్కు లేదని లేదని BJP నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాతే తెలంగాణకు రాహుల్ రావాలన్నారు. 'GHMCలో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. GHMCలో వీధిలైట్ల రిపేర్లకు 7 నెలల నుంచి నిధులు లేవు. అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో BRS ఉంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి' అని వ్యాఖ్యానించారు.