పాక్ చొరబాటుదారుడు అరెస్ట్

75చూసినవారు
పాక్ చొరబాటుదారుడు అరెస్ట్
జమ్మూ జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో పాకిస్థానీ చొరబాటుదారుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నియంత్రణ రేఖకు సమీపంలోని మిలన్ డి ఖుయ్ గ్రామంలో కరాచీకి చెందిన జహీర్ ఖాన్‌‌ను పోలీసులు గుర్తించారు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని ప్రశ్నించారు. తాను పాకిస్థానీ అని, అనుకోకుండా నియంత్రణ రేఖను దాటినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అతడిని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్