పార్లమెంటులోని ఎలుకలను వేటాడేందుకు పిల్లులను నియమించనున్న పాకిస్థాన్

75చూసినవారు
పార్లమెంటులోని ఎలుకలను వేటాడేందుకు పిల్లులను నియమించనున్న పాకిస్థాన్
పార్లమెంట్లోని ఎలుకలను పట్టుకునేందుకు పిల్లులను ఏర్పాటు చేయాలని పాకిస్థానీ పౌర సంస్థ, క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ (CDA) నిర్ణయించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఇందుకోసం సుమారు రూ.3,62 లక్షల (PKR 12 లక్షలు) బడ్జెట్ ను సిద్ధం చేసినట్లు పేర్కొంది. పార్లమెంటు లోపల ఉన్న ఎలుకలు పాకిస్థాన్ సెనేట్, నేషనల్ అసెంబ్లీలోని వివిధ డిపార్ట్మెంట్లు, అనేక కార్యాలయాల్లోని ఫైళ్లను కొరికేశాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్