పానీ పూరీ తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పానీ పూరీలో ఉల్లిపాయ, శనగలు, బంగాళదుంపలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పానీ పూరీ నీళ్ల తయారీలో జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, అల్లం మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు మంచివి. ఇంకా వీటి వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అయితే పానీ పూరీ తినేటప్పుడు అది స్వచ్ఛమైన పరిసరాలలో తయారైందా? వాటి కోసం ఉపయోగించే నీరు శుభ్రంగా ఉందా? అనేది చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.