AP: పాస్టర్ ప్రవీణ్ కుటుంబసభ్యుల వాంగ్మూలం నమోదు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. కేసు దర్యాప్తులో ఐదు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని స్పష్టంచేశారు. కేసు దర్యాప్తు పురోగతిని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని, కేసుకు సంబంధించి వందతులు, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని సూచించారు.