ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 33 సార్లు తలపడగా.. అందులో కేకేఆర్‌దే పైచేయిగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గత సీజన్‌లో ఈ ఇరు జట్లు ఒకే ఒక్క మ్యాచ్ లోతలపడగా అందులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.