జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో కొత్తగా Tiguan R-Line ఎస్‌యూవీని విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో ఆకట్టుకునే ఈ లగ్జరీ వాహనం ధర ₹48.99 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. ఈ ఎస్‌యూవీలో 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఏప్రిల్ 23 నుంచి డెలివరీలు ప్రారంభమవనున్నాయని కంపెనీ తెలిపింది.