పెద్దపల్లి జిల్లాలోని మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఎరువుల బస్తాల లారీ ప్రమాదానికి గురి కావడంతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ప్రమాద సంఘటన స్థలాన్ని సందర్శించారు. వారు మాట్లాడుతూ.. నది ఒడ్డున గల అంబేద్కర్ చౌరస్తాలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదన్నారు. పగటిపూట సమయంలో భారీ వాహనాలను పట్టణం లోపలికి ప్రవేశాలు కల్పించనివ్వద్దని డిమాండ్ చేశారు.