తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్ళేవో స్పష్టంగా తెలిసిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీరు తాగునీరు విద్యుత్తు వంటి మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం శోచనీయమన్నారు. రజతోత్సవ సభ అనంతరం పార్టీ సభ్యత్వ ప్రక్రియ, గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయల కేంద్రంగా శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాలు శనివారంతో ముగిసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.