మాజీ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. 'ఏడాదిలో 54 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. గ్రూప్-1 పరీక్షలను నిర్వహించాం. ఖరీఫ్‌లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి తమ ప్రభుత్వ ఘనత. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుతో మాకు అప్పగించింది వాస్తవం కాదా? మీ అరాచకాన్ని ప్రజలు ఎప్పటికీ మరవరు. కేటీఆర్, హరీశ్‌రావు, కవితను కేసీఆర్ అదుపులో పెట్టాలి' అని లేఖలో పేర్కొన్నారు.