ఏపీలో వినాయక మండపాలకు అనుమతుల విషయంలో సింగిల్ విండో విధానం తీసుకొచ్చినట్లు పోలీసు శాఖ పేర్కొంది. గతంలో పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి నిరభ్యంతర పత్రం (NOC) తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం www.ganeshutsav.net ద్వారా అన్ని అనుమతులు ఒకే చోట పొందొచ్చని తెలిపింది. లేదా 7995095800 నంబరుకు వాట్సాప్‌లో HI అని మెసేజ్‌తో దరఖాస్తు, మీ సేవ కేంద్రంలో రుసుము చెల్లించాక NOC లభిస్తుందన్నారు.