ఫోన్ ట్యాపింగ్: నిందితుల బెయిల్ పిటిషన్ వాయిదా

70చూసినవారు
ఫోన్ ట్యాపింగ్: నిందితుల బెయిల్ పిటిషన్ వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై మార్చి 10న FIR నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావును అరెస్టు చేసి మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. తమకు బెయిల్ కావాలని అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దన్న పీపీ కోరారు. ఇరువురు బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్