మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పిట్‌బుల్ జాతికి చెందిన కుక్క ఓ తల్లి వీధికుక్కపై పాశవికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పిట్‌బుల్ కుక్క వీధికుక్కపై దాడి చేస్తున్నప్పుడు దాని యజమాని కూడా అక్కడే ఉండడం విశేషం. ఆమె కొంచెం కూడా ఆపకుండా వీధికుక్కపై దాడి చేసి చంపేందుకు తన కుక్కను అనుమతించినట్లు వ్యవహరించింది.