పుచ్చ సాగులో సస్యరక్షణ చర్యలు

50చూసినవారు
పుచ్చ సాగులో సస్యరక్షణ చర్యలు
వేసవి పుచ్చ సాగులో సస్యరక్షణ చర్యలు పాటిస్తే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. దీనిలో పండు ఈగ సమస్య అధికంగా ఉంటుంది. నివారణకు క్యూల్యూర్ అనే పండు ఈగ ఆకర్షణ బుట్టలు ఎకరానికి 10-20 చొప్పున పంటకాలం మొత్తం అమర్చుకోవాలి. తీవ్రతను బట్టి మలాథియాన్ 2 ml లేదా ప్రొఫెనొఫాస్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగు నివారణకు ఎసిఫెట్+లామ్డా సైహాలోత్రిన్ 1-1.5 గ్రా. లేదా ఇమిడాక్లాప్రిడ్ 0.4 ml లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్