కీర దోస సాగులో సస్య రక్షణ చర్యలు

59చూసినవారు
కీర దోస సాగులో సస్య రక్షణ చర్యలు
వేసవి పంటగా రైతులు ఎక్కువగా కీర దోస పంటను సాగు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పురుగులు ఎక్కువగా ఈ పంటను ఆశిస్తాయి. వాటిలో గుమ్మడి పెంకు పురుగు.. ఇవి మొలకెత్తిన మొక్కల లేత పత్రాలను ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు ట్రైక్లోఫోరాన్‌ (5%) పొడిమందును చల్లాలి. పది రోజులకు మరలా చల్లాలి. పండు ఈగ (ఫ్రూట్‌ ఫ్లై) నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్