కూటమి నేతల వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం (వీడియో)

73చూసినవారు
AP: కూటమి నేతల వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 9వ వార్డులో పార్వతీదేవి మహిళా సమాఖ్య ఆర్పీగా సరళమ్మ గత ఆరేళ్లుగా సేవలిందిస్తున్నారు. స్థానిక నేతలు ఆమెను విధుల నుంచి తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సరళమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

సంబంధిత పోస్ట్